మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (10:16 IST)

ఆదివారం దినఫలితాలు - ఆర్థిక వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా?

మేషం : మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారు అచ్చుతప్పులు పడటువల్ల మాట పడవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో పరిచయాలు, వ్యపకాలు అధికమవుతాయి. వృత్తి వ్యాపారులకు

మేషం : మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారు అచ్చుతప్పులు పడటువల్ల మాట పడవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో పరిచయాలు, వ్యపకాలు అధికమవుతాయి. వృత్తి వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. 
 
వృషభం : ఆర్థిక వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన ఫలితాలొస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న విధంగా సాగవు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. 
 
మిథునం : విద్యార్థులు, బజారు తినుబండారాలు భుజించుట వల్ల అస్వస్థతకు లోనవుతారు. రాజకీయ నాయకులు సంఘంలో గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. కొబ్బరి, పండ్లు, పూల, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. ఉద్యోగ రీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది.
 
కర్కాటకం : స్త్రీల ఆహారం విషయంలో వేళ తప్పి భుజించుట వల్ల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాలు అనుకూలించవు. 
 
సింహం : మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. చిన్నచిన్న సమస్యలెదురైనా పరిష్కరించుకుంటారు. రాజకీయ నాయకులు, సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. విద్యుత్ రంగాల వారికి అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రుణాలు తీర్చి తాకట్టులు విడిపించుకుంటారు. 
 
కన్య : రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. స్త్రీలు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బందులకు దారితీస్తాయి. 
 
తుల : కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ముఖ్యమని గమనించండి. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత ఇతరాత్రా చికాకులు అధికమవుతాయి. కొత్త రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఆలయాలను సదర్శిస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఆశించిన సంస్థలలో అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది.
 
వృశ్చికం : ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేక పోతారు. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక త్వరలో నెరవేరుతుంది. మిత్రుల నుంచి ఆశ్చర్యకరమైన వార్తలు వినవలసి వస్తుంది. 
 
ధనస్సు : మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాల ఏర్పాట్లు ఫలించక పోవచ్చు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. సోదరీ, సోదరుల మధ్య ఏకాగ్రత లోపం అధికమవుతుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. ప్రేమికుల మధ్య చిన్నచిన్న కలహాలు ఏర్పడతాయి. 
 
మకరం : ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. సన్నిహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. 
 
కుంభం : మత్స్యు, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పరిచయస్తులకు సాయం అందిస్తారు. ఇతరులపై ఆధారపడక స్వశక్తితోనే మీ పనులు పూర్తి చేసుకోవడం శ్రేయస్కరం. విందు, వినోదాలలో పరిమితి పాటించండి. 
 
మీనం : ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పెద్దల ఆరోగ్యం విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. రుణ యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. మీ సిఫార్సుతో ఒకరికి మంచి అవకాశం లభిస్తుంది.