శుక్రవారం, 22 సెప్టెంబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 23 అక్టోబరు 2022 (21:58 IST)

దీపావళి రోజున లక్ష్మీ పూజ.. స్వస్తిక్ గుర్తు, తామరపువ్వు, శ్రీయంత్రం?

Lakshmi Puja
Lakshmi Puja
దీపావళి రోజున లక్ష్మీ పూజ చేసే వారికి సకలసంపదలు చేకూరుతాయి. అమావాస్య రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిందని ప్రతీతి. దీపావళి ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. దీపావళి నాడు ఇంటింటా దీపాలు వెలిగిస్తారు. చీకటి నుండి వెలుగులోకి పయనించడం ద్వారా అజ్ఞానం నుండి జ్ఞానం వైపు పయనించడానికి దీపావళి ప్రతీక. 
 
దీపావళి అమావాస్య రాత్రి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీపావళి లక్ష్మీ పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీ సమేతంగా వినాయకుడిని, కుబేరుడిని పూజించడం ఆనవాయితీ. ఇలా పూజించడం ద్వారా సర్వసుఖాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే లక్ష్మీ పూజ సమయంలో ఆమె పాదాలను పూజించాలి. ముఖ్యంగా లక్ష్మీపూజ చేసేటప్పుడు తప్పకుండా తామరపువ్వును వుంచడం మరిచిపోకూడదు. దీపావళి నాడు శ్రీయంత్రాన్ని పూజించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. శ్రీయంత్రం లేకుండా లక్ష్మీ పూజ అసంపూర్ణమని పండితులు చెప్తున్నారు. ఇక నైవేద్యంగా రవ్వతో చేసిన వంటకాలు.. డ్రైఫ్రూట్స్‌తో చేసిన పాయసాన్ని సమర్పించాలి. తమలపాకుపై స్వస్తిక్ గుర్తును వేసి వుంచి పూజచేయడం మంచిది. 
 
చెరకు రసాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. లక్ష్మీపూజ సమయంలో ధనియాలను శుభ్రమైన పాత్రలో వేసి అమ్మవారి ముందు ఉంచాలి. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది అదృష్టం ,శ్రేయస్సు చిహ్నంగా పరిగణించబడుతుందని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.