బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 అక్టోబరు 2022 (10:00 IST)

ధనత్రయోదశి.. శని మకరరాశిలో డబ్బు రాకకు కొత్త మార్గాలొస్తాయ్

Diwali
దీపావళి కంటే ముందు ధనత్రయోదశి జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 23న ధనత్రయోదశి వస్తుంది. ఈరోజు నుంచి శని మకరరాశిలో సంచరిస్తుంటాడు. ఫలితంగా కొన్ని రాశుల వారి జీవితంలో సంతోషం, ధన ప్రవాహం ఉండవచ్చు. ఈ ఏడాది అక్టోబర్ 23, ధన త్రయోదశి నుంచి శని మకరరాశిలో సంచరిస్తుంటాడు. ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి.  
 
మేషరాశి: శని సంచారంతో మేషరాశి వారికి ప్రయోజనం కలుగుతుంది. మేషరాశి ప్రజలు ధనలాభంతో పురోగమించే అవకాశాలను పొందుతారు. కొత్త వాహనం లేదా భవనాన్ని కొనుగోలు చేయవచ్చు.
 
మిథునరాశి : ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అన్నివిధాల అదృష్టం కలిసివస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది.  
 
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ధన త్రయోదశి నుంచి మంచి రోజులు మొదలవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో కొత్త అవకాశాలు పొందుతారు. 
 
వృశ్చికం : వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. డబ్బు రాకకు కొత్త మార్గాలు లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో శాంతి ఉంటుంది.