దీపావళి: అష్టైశ్వర్యాలు చేకూరాలంటే ఇలా చేయాలి  
                                       
                  
                  				  దీపావళి నాడు లక్ష్మీదేవి పటాన్ని లేదా ప్రతిమను.. అలాగే విఘ్నేశ్వరుడు, ఇంద్ర, కుబేరుడిని పూజించేందుకు ఈశాన్య లేదా ఉత్తర లేదా తూర్పు దిశవైపుగా ముఖాలు ఉండేలా ప్రతిష్టింపజేసుకోవాలి.
				  											
																													
									  
	ఇలా చేస్తే ఆ ఇంటి యందు అష్టైశ్వర్యాలు సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. దీపావళి ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకుని పాతబడిన, పనికిరాని వస్తువులను ఇంటి నుంచి పారేయడం ద్వారా కొత్త శక్తిని ఆహ్వానింపజేసుకోవచ్చు.
				  
	
	 
	దీపావళి రోజున ఇంటిని అలంకరించుకోవడం ద్వారా ఆ మహాలక్ష్మీ దేవిని ఆహ్వానించినట్లవుతుంది. శుచి, శుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి మామిడి ఆకుల తోరణాలు, బంతిపూల హారాలు ఇంట్లో తాజా పువ్వులతో అలకరించి ఇంటి నిండా దీపాలతో లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	
	 
	ఉత్తరం దిశలో కుబేర స్థానం సంపదకు చిహ్నంగా భావిస్తారు. ఈ ప్రదేశంలో లాకర్ లేదా అల్మారాను అమర్చుకుంటారు. అలాగే అమర్చిన లాకర్‌లో లక్ష్మీదేవిని ప్రతిమను ఉంచుకుని దీపావళి రోజున పూజలు చేస్తే సకల శుభాలు, ఆయురారోగ్యాలు, సంపదలు వెల్లివిరుస్తాయి.