సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By
Last Updated : శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (13:52 IST)

ప్రతిరోజూ గాయత్రి మంత్రాన్ని జపిస్తే..?

ఈ సర్వసృష్టికి మూలమైనది శక్తిరూపం. ఆ శక్తి రూపం నుండి వచ్చిన మనం తిరిగి ఆ శక్తిని దర్శించి తరించాలి. ఆ శక్తి రూపమే గాయత్రి మాత. ఆ గాయత్రీమాత కరుణా కటాక్షల కోసం అందించినదే గాయత్రి మంత్రం.
ఓం భూర్భువస్సువః
తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి
ధియోయోనః ప్రచోదయాత
 
ఇది గాయత్రి మంత్రం. ప్రతి ఒక్కరు పఠించిదగిన విశేషమంత్రం. గాయత్రీ బీజమంత్రం. శబ్దపరంగానూ, మంత్రోచ్చారణ చేసినవారిలో గుప్త స్పందన కలిగి వివిధ శక్తి కేంద్రాలు చైతన్యవంతమవుతాయి. 
 
గాయత్రి మంత్రం పురుషులే పఠించదగినదని కానీ, కొన్ని వర్గాలవారికే పరిమితమైనదని కానీ శాస్త్రాలలో ఎక్కడా లేదు. ధ్వని ప్రధానమైనది కాబట్టి స్వచ్ఛత ఉండి తీరాలి. అందుకు మినహాయింపు లేదు. అందువలన ప్రతిరోజూ గాయత్ర మంత్రాన్ని పఠించిన వారు గాయత్రీ మాత కరుణా, కటాక్షాలను పొందగలరు.