1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 29 మే 2018 (15:59 IST)

ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్లేటపుడు ఆ పని చేస్తే అనుకున్నది నెరవేరుతుంది...

లక్ష్మీదేవీ కటాక్షం కోసం చేయలసినవి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. సంధ్యాసమయంలో ఇల్లు శుభ్రం చేసే కార్యక్రమాలు చేయకుండా, దానికి పూర్వమే దీపాన్ని వెలిగించాలి. పరగడుపున కార్యార్థం బయటికి వెళ్ళకూడదు. కనీసం

లక్ష్మీదేవీ కటాక్షం కోసం చేయలసినవి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. సంధ్యాసమయంలో ఇల్లు శుభ్రం చేసే కార్యక్రమాలు చేయకుండా, దానికి పూర్వమే దీపాన్ని వెలిగించాలి. దేవీదేవతలకు ధూప, దీపహారతులు ఇవ్వాలి. ఏ పని కోసమైనా ఇంటినుండి బయటకు వెళ్ళేముందుగా, ఇంటిని చీపురుతో శుభ్రం చేసుకోవాలి. పరగడుపున కార్యార్థం బయటికి వెళ్ళకూడదు. కనీసం చెంచా తీయని పెరుగును నోటిలో వేసుకునే వెళ్ళాలి. ఇలా చేయడం వలన మీరు అనుకున్న కార్యాలు శుభంగా జరుగుతాయి. 
 
లక్ష్మీకటాక్షాన్ని దక్కించుకోవాలంటే మహాలక్ష్మీకి తులసి పత్రాన్ని, తులసి మంజరిని సమర్పించాలి. సాధనా, పూజా, ప్రార్థనా సమయంలో మీ ముఖం తూర్పుపైపుగా ఉండాలి. గురువారం రోజు ఏ మహిళనైనా పిలిచి మంగళకరమైనది ఏదైనా ఒకటిదానం చేయాలి. దీన్ని క్రమబద్ధం చేసుకుంటే మంచిది. తెల్లని వస్తువులు దానం చేస్తే లక్ష్మీకటాక్షం కలుగుతుంది. ధన సంబంధమైన కార్యాలన్నింటికీ సోమవారం, బుధవారలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. 
 
ప్రతి శనివారిం ఇంటిని శుభ్రపరుచుకోవాలి. సాలెగూళ్ళు, మట్టి, చెత్త, విరిగిపోయిన వస్తువులన్నీ సర్ది చక్కబరుచుకోవాలి. మీ ఇంటి సింహద్వారం దగ్గర లోపలివైపు, శ్రీ గణేశుడిని ఉంచాలి. ఆయన ముఖం మీ ఇంటిని చూస్తున్నట్లుగా ఉంచాలి. ఇలా ఇంటిని సర్దేసి, శుభ్రం చేసుకుంటే తెల్లవారు, సంధ్యాసమయాల్లో దీపాలను వెలిగించి, నిష్ఠతో పూజచేస్తే మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అంతేకాకుండా ధనవంతులవుతారు.