వీరభద్ర స్వామి మహిమాన్వితం...
దక్షుడిని సంహరించడం కోసం పరమశివుడు జటా జూటం నుండి వీరభద్రుడు జన్మించాడు. దక్షుడిని సంహరించిన అనంతరం వీరభద్రుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించారు. అలా ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాల్లో 'అల్లాడు పల్లె'
దక్షుడిని సంహరించడం కోసం పరమశివుడు జటా జూటం నుండి వీరభద్రుడు జన్మించాడు. దక్షుడిని సంహరించిన అనంతరం వీరభద్రుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించారు. అలా ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాల్లో 'అల్లాడు పల్లె' ఒకటి. కడప జిల్లా పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోందని శాస్త్రంలో చెప్పబడుతోంది. సువిశాలమైన ప్రదేశంలో భారీ నిర్మాణాలతో శిల్పకళతో ఈ ఆలయం కనిపిస్తుంటుంది.
వందల సంవత్సారాల చరిత్ర ఉన్న ఈ క్షేత్రంలో స్వామి ప్రత్యక్షంగా ఉన్నాడని భక్తులు విశ్వసిస్తుంటారు. వీరభద్ర స్వామి వారి మూర్తి పెరుగుతుందమే అందుకు నిదర్శమని చెప్పబడుతోంది. ప్రతిష్ట నాటికి, ఇప్పటికీ స్వామి మూర్తి పెరుగుతుందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలున్నాయి.
అందువలన ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది. ఈ వీరభద్ర స్వామివారిని ఆరాధించడం వలన ఆపదలు, అనారోగ్యాలు దూరమవుతాయని, మనస్సులోని కోరికలు నెరవేరుతాయని భక్తులు భావిస్తుంటారు.