శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 10 ఆగస్టు 2021 (22:03 IST)

శ్రీ వేంకటేశ సుప్రభాతం విశిష్టత ఏమిటి?

భూలోకవైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో వెలిసిన జగత్ ప్రసిద్ధమైన ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. ఈ స్వామి వారికి సుప్రభాతం తెలుపుతూ ఆయన గుణగణ చేష్టితాలను కీర్తించే 70 శ్లోకాలున్న లఘుకృతి శ్రీ వేంకటేశ సుప్రభాతం.
 
దీనిని మనవాళ మహాముని రచించారు. ఒక్క ధనుర్మాసంలో తప్ప మిగిలిన అన్ని నెలల్లోనూ ఉషఃకాలంలో జరిగేది ఇదే. దీని పఠనా కాలం సుమారు 20 నిమిషాలు.
 
ఇందులో ప్రధాన వస్తువు శ్రీవారి దివ్యవైభవాన్ని ప్రశంసించడమే. ఇందులో సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళశాసనం వున్నాయి. ఇది వైష్ణవ సంప్రదాయ సంబంధమైనది.