ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By
Last Modified: శుక్రవారం, 2 నవంబరు 2018 (16:54 IST)

ఇద్దరం కలిసి ఆ పని చేద్దాం రమ్మంటున్నాడు... కాదంటే గొళ్లెం పెడుతున్నాడు...

మేము నగరంలో ఉంటున్నాం. ఎంతో కష్టపడి ఓ సింగిల్ బెడ్రూం ఫ్లాట్ కొన్నాం. అందులో నేను, నా భర్త ఆయన పేరెంట్స్ ఉంటున్నాము. మొన్నీమధ్య ఉదయాన్నే... నా భర్త నాతో... ఇద్దరం కలిసి స్నానం చేద్దాం రమ్మని అడిగారు. కానీ ఆ సమయంలో ఆయన పేరెంట్స్ ఉన్నారు. దాంతో సర్ది చెప్పాను. కానీ మరుసటి రోజు కూడా అలాగే చేశారు. నేను కాదని చెప్పేసరికి నాతో సరిగా మాట్లాడటం లేదు. చిన్నపిల్లాడిలా పడక గది తలుపు గొళ్లెం పెట్టుకుని పడుకుంటున్నాడు. ఆయన ఎందుకిలా ప్రవర్తిస్తోందో నాకర్థం కావడంలేదు...
 
భార్యభర్తల్లో కొందరు వారు అనుకున్న కోర్కెలు, భాగస్వామితో తీర్చుకోవాలనుకున్నవి కొన్ని మిగిలిపోతాయి. వాటిని తీర్చుకునేందుకు చూస్తారు కొందరు. అలాగే వర్షాకాలం ప్రారంభమైన ఈ సమయంలో రొమాంటిక్‌గా గోరువెచ్చని నీటి స్నానం చేయాలని అనుకుని ఉండవచ్చు. అనుకున్నది జరుగకపోతే కొంతమంది ఇలాగే మొండిగా ప్రవర్తిస్తుంటారు. కనుక ఎలాగో సర్ది చెప్పి ఆయన పేరెంట్స్ ఇంట్లో లేని సమయం చూసి ఆయన కోరిక తీర్చవచ్చు. ఇదే విషయాన్ని ఆయనకు చెబితే అర్థం చేసుకుంటారు. ప్రయత్నించండి.