శ్రీ చక్రం మహిమ గురించి మీకు తెలుసా?
శ్రీ చక్రం జీవితంలో సమస్యలను, ప్రతికూలతను తొలగిస్తుంది. దీనిని ఉపయోగించే వారికి సకలసంపదలు చేకూరుతాయి. శాంతి, ప్రశాంతత చేకూరుతుంది. శ్రీ చక్రం జీవితంలో అన్ని అడ్డంకులను తొలగించగలదు. విజయం, కీర్తి, గౌరవం, సంపద, ఐక్యతను సంపాదించి పెడుతుంది.
మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులకు చెక్ పెడుతుంది. వ్యాపారాభివృద్ధినిస్తుంది. శుక్రవారం ఇంట్లో కానీ, కార్యాలయంలో కానీ శ్రీ చక్రాన్ని స్థాపించడం మంచిది.
శ్రీ చక్రాన్ని ఇంటిలో శుభ్రమైన ప్రదేశంలో వుంచి పూజించాలి. బంగారు, రాగి లేదా వెండి రంగుల్లో చిత్రీకరించిన శ్రీ చక్రం మంచిది. శుక్రవారం శ్రీ చక్ర పూజ విశేష ఫలితాలను ఇస్తుంది. ఇంటికి పశ్చిమ దిక్కులో శ్రీ చక్రం వుంటే మంచిది.