తిరుమలలో ఘనంగా పవిత్రతోత్సవాలు ప్రారంభం
తిరుమలలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా శ్రావణమాసంలో శుక్లపక్ష త్రయోదశినాడు ముగిసే విధంగా తిరుమలలో పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఆగష్టు 1వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి యేడాది ఏకాదశి, ద్వాదశి, త్రయోదశినాడు ఉత్సవాలను నిర్వహించడం టిటిడికి ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు పవిత్ర ప్రతిష్ట జరుగగా రేపు పవిత్ర సమర్పణ, ఆగష్టు 1వ తేదీన పూర్ణాహుతి జరుగనుంది.
సంవత్సరం మొత్తం ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, వేడుకలు అర్చకుల వల్ల సిబ్బంది వల్ల తెలిసీ తెలియకుండా కొన్ని దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి భంగం కలుగకుండా ఆగమశాస్త్రం ప్రకారం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం టిటిడికి ఆనవాయితీగా వస్తోంది. కరోనా పుణ్యమా అని ఏకాంతంగా పవిత్రోత్సవాలను టిటిడి నిర్వహిస్తోంది.