శనివారం, 14 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (10:58 IST)

వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ : సెమీస్‌లో అడుగుపెట్టిన సానియా జోడీ

sania  mirza
లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ సెమీ ఫైనల్స్‌కు చేరింది. క్రొయేషియాకు చెందిన మేట్ పావిక్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా మీర్జా ఈ పోటీలో తలపడ్డారు. క్వార్టర్ ఫైనల్‌లో తన ప్రత్యర్థిని చిత్తు చేసి సెమీస్‌కు దూసుకొచ్చారు. 
 
ఈ మ్యాచ్‌లో సానియా జోడీ 6-4, 3-6, 7-5 తేడాతో నాలుగో సీడ్ గాబ్రిలా, జాన్ పీర్స్ జోడీని ఓడించింది. ఇందులో సానియ జోడీ ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన విషయం తెల్సిందే. పైగా, ఇందులో సానియా ఫోర్‌హ్యాండ్ షాట్లతో హోరెత్తించారు. మ్యాచ్ ఆద్యంతం పవర్‌ఫుల్ షాట్స్ అడుతూ ప్రత్యర్థుల్ని బెంబేలెత్తించింది. మరోవైపు, సానియా మీర్జా ఆడే చివరి మిక్స్‌డ్ డబుల్స్ టోర్నీ ఇదే కావడం గమనార్హం.