ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం - రూ.కోట్లలో ఆస్తి నష్టం

anyang fire accident
హైదరాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తి నష్టం వాటిల్లింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల్లో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవి జంట నగర వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 
 
ఇటీవల సికింద్రాబాద్ దక్కన్ స్పోర్ట్స్ మాల్‌ భవనంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటన మరువకముందే నగరంలో మరో ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ చిక్కడపల్లి వీఎస్టీ సమీపంలోని ఓ గోదాంలో ఈ భారీ అగ్నిప్రమాదం జరిగింది. టెంట్ హౌస్‌లో హోల్‌సేల్ సప్లై చేసే గోదాంలో ఈ ప్రమాదం సంభవించింది. 
 
అగ్నిప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు, పొగలు చెలరేగాయి. ప్రమాదం ధాటికి గోదాంలోని సామాగ్రి అంతా పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రెండు ఫైరింజన్లతో వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.