గురువారం, 12 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (22:07 IST)

కాంతారావు-2లో సూపర్ స్టార్ రజనీకాంత్? (video)

kantara
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి 'కాంతారావు' సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 400 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. దర్శకుడిగా, రచయితగా ఈ సినిమా రిషబ్ శెట్టికి ప్రశంసలు తెచ్చిపెట్టింది. 
 
కాగా, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా రిషబ్ శెట్టిని తన ఇంటికి ఆహ్వానించి సన్మానించారు. మొదటి భాగానికి పాన్ ఇండియా రెస్పాన్స్ రావడంతో రెండో భాగాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించాలని రిషబ్ శెట్టి ఆలోచిస్తున్నాడు. 
 
ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో టేకాఫ్ కావాలంటే ఆ స్థాయి తారాగణం కూడా అవసరం. అందుకే ఈ సినిమా కాంతారావు 2లో రజనీకాంత్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తే బాగుంటుందని భావించిన రిషబ్ శెట్టి.. ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడని టాక్. 
 
మరి రజనీకాంత్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి. ప్రస్తుతం రజనీకాంత్ తన రాబోయే యాక్షన్ డ్రామా జైలర్ కోసం పని చేస్తున్నారు.