గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

గూస్ బంప్స్ తెప్పిస్తున్న "పవర్ గ్లాన్స్" - తొడకొట్టాడో .. తెలుగోడు (Video)

pawan kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అనేక సినీ, రాజకీయ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ బర్త్‌డేను పురస్కరించుకుని ఆయన నటించే "హరి హర వీరమల్లు" చిత్రానికి సంబంధించి "పవర్ గ్లాన్స్"ను రిలీజ్ చేశారు.
pawan kalyan
 
మొఘలాయిలు, కుతుబ్‌షాహీల శకం నేపథ్యంలో సాగే కథ. చరిత్రకెక్కిన ఒక బందిపోటు వీరోచిత గాథగా ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత ఏఎం రత్నం సమర్పిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై నిర్మాత దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.