మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 1 అక్టోబరు 2023 (16:05 IST)

శివరాజ్ కుమార్ ఉగ్రరూపం - మాస్ యాక్షన్‌తో 'ఘోస్ట్' - ట్రైలర్ రిలీజ్

ghost movie
కన్నడ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం 'ఘోస్ట్'. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకక్కింది. శ్రీని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "జైలర్" చిత్రంలో అతిథి పాత్రలో నటించిన శివరాజ్ కుమార్.. ఇపుడు సోలో హీరోగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రానున్నారు. 
 
ఇప్పటికే రిలీజైన్ గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది. ఇందులో శివన్న మాస్ పాత్రలో కనిపిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌లో సామ్రాజ్యాలు సృష్టించేవాడిని చరిత్ర మరిచిపోతుందేమో కానీ, విధ్వంసం సృష్టించేవాడిని ఎపుడూ మరిపోదంటూ అనే డైలాగ్‌తో ఈ సినిమా ఎలా ఉండబోతుందనే హింట్ ఇచ్చింది.