బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 నవంబరు 2022 (10:05 IST)

రతన్ టాటా బయోపిక్‌కు ఆకాశం నీ హద్దు రా దర్శకురాలు రెడీ

ratan tata
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా జీవిత కథ ఆధారంగా సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాకు సుధ కొంగర దర్శకత్వం వహించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
ఆకాశం నీ హద్దు రా చిత్రంతో జాతీయ స్థాయిలో దర్శకురాలిగా మెరిగిస సుధ కొంగర.. ఈ చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్‌తో రీమేక్ చేస్తున్నారు. 
 
ఈ సినిమా పూర్తయిన పిమ్మట రతన్ టాటా జీవిత కథను తెరపైకి తీసుకువచ్చేందుకు అన్నీ సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
 
స్క్రిప్ట్ వర్క్‌లో ప్రస్తుతం బిజీగా వున్న సుధ.. వచ్చే ఏడాది అక్టోబరులో ఈ సినిమాను పూర్తి చేసే ఛాన్సుందని టాక్ వస్తోంది. ఇందులో సూర్య, అభిషేక్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు ప్రచారం సాగుతోంది.