శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 జులై 2022 (20:24 IST)

వాస్తు : పూజ గదిలో పూర్వీకుల ఫొటోలు వుండకూడదట

వాస్తు ప్రకారం ఆనందం, శ్రేయస్సు, అదృష్టం కోసం తులసి మొక్క ఇంటి ముందు ఉండాలి. అదేవిధంగా వృత్తిలో లేదా వ్యాపారంలో విజయం సాధించడానికి అరటి చెట్టును నాటాలి. దానిని ప్రతిరోజూ పూజించాలి. వాస్తు ప్రకారం తాగునీరు ఎల్లప్పుడూ ఈశాన్య మూలలో ఏర్పాటు చేయాలి. 
 
వాస్తు ప్రకారం ఇంట్లో భూగర్భ నీటి ట్యాంక్, బోర్‌వెల్ లేదా చేతి పంపు ఏర్పాటు చేయాలంటే అది ఎల్లప్పుడూ ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఏర్పాటు చేయాలి.
 
వాస్తు ప్రకారం పూజా స్థలంలో ఎప్పుడూ పూర్వీకుల ఫొటోలు ఉండకూడదు. మరణించిన వారి ఫొటోలని దక్షిణ దిశలో ఉంచాలి. వాస్తు ప్రకారం ఇంట్లో ఎక్కువ ఫోటోలు లేదా క్యాలెండర్లు ఉండకూడదు. 
 
ఇంటి లోపల ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడానికి ప్రతిరోజూ ఉదయం ఇంటి కిటికీ, తలుపులను కొంత సమయం పాటు తెరిచి ఉంచాలి. రాత్రి వేసుకున్న దుస్తులు రెండో రోజు స్నానం చేసిన తర్వాత మళ్లీ ధరించకూడదని వాస్తు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు.