సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 5 మే 2017 (13:36 IST)

వేసవిలో మేకప్ వద్దు.. మజ్జిగనీళ్లు, ఉల్లిపాయ ముక్కలే ముద్దు..

వేసవిలో మహిళలు మేకప్‌కు ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించాలి. అతిగా బయట తిరగకూడదు. సన్ స్క్రీన్ క్రీములు, మాయిశ్చరైజర్ క్రీములతో సరిపెట్టుకోవాలి. అంతేకానీ మేకప్ కోసం రసాయనాలతో కూడిన కిట్లను ఉపయోగించకూడదు. ఇలా

వేసవిలో మహిళలు మేకప్‌కు ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించాలి. అతిగా బయట తిరగకూడదు. సన్ స్క్రీన్ క్రీములు, మాయిశ్చరైజర్ క్రీములతో సరిపెట్టుకోవాలి. అంతేకానీ మేకప్ కోసం రసాయనాలతో కూడిన కిట్లను ఉపయోగించకూడదు. ఇలా చేస్తే.. చర్మానికి దెబ్బ తప్పదు. లేత రంగు దుస్తులను ఎంచుకోవాలి. ముదురు రంగు దుస్తుల్ని పక్కనబెట్టాలి. లేత రంగు లేదా తెలుగు రంగు ఎండ వేడిమిని గ్రహించుకోవు కాబట్టి వాటిని ఉపయోగించడం మంచిది. 
 
లో దుస్తులను కాస్త వదులుగా వేసుకోవడం.. దుస్తులను కూడా వదులుగా ధరించడం మంచిది. పట్టు, నైలాన్, పాలిస్టర్ వంటి దుస్తులను ఉపయోగించకూడదు. సాధ్యమైనంత వరకు కాటన్ చీరలు వాడటం మంచిది. ఇక తిండి విషయానికి వస్తే నూనె పదార్థాలను పూర్తిగా పక్కనబెట్టేయాలి. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. తేనె కలిపిన నిమ్మరసం వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది. 
 
ఇంకా మజ్జిగ నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. అంబలితో ఉల్లి పాయలను తీసుకోవాలి. బత్తాయి, ఫైనాపిల్, మామిడి పండ్ల జావలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.