శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By selvi
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2017 (14:00 IST)

పొదుపు చాలా ముఖ్యం.. లేకుంటే కాసుల కోసం కష్టాలే..

పొదుపు చాలా అవసరం. ఒక లక్ష్యం పెట్టుకుని దానికి తగినట్లుగా పొదుపు చేసుకుంటూ పోతే ఏ సమస్యా వుండదు. ఇల్లూ, కారు, పిల్లల చదువు ఏదైనా కావచ్చు. కొన్ని కాలపరిమితులు పెట్టుకుని పొదుపు చేసుకుంటూ పోవాలి. లక్ష్

పొదుపు చాలా అవసరం. ఒక లక్ష్యం పెట్టుకుని దానికి తగినట్లుగా పొదుపు చేసుకుంటూ పోతే ఏ సమస్యా వుండదు. ఇల్లూ, కారు, పిల్లల చదువు ఏదైనా కావచ్చు. కొన్ని కాలపరిమితులు పెట్టుకుని పొదుపు చేసుకుంటూ పోవాలి. లక్ష్యాలతో పాటు సరదాలు, సంతోషాలు ముఖ్యమే.

కాబట్టి దానికి తగినట్టుగా కూడా కొంత మొత్తాన్ని విడిగా పెట్టుకోవాలి. ఎలాగంటే దేశ, విదేశ పర్యటనలూ కొనుక్కోవాల్సి ఎలక్ట్రానిక్ పరికరాలు, వీటిని కూడా ముందు నుంచే బ్యాంకుల్లో పొదులు చేసుకోవాలి. బ్యాంకులు ఇందుకు అనుగుణంగా తాత్కాలిక లక్ష్యాల కోసం కూడా పొదుపు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. 
 
ఇక అత్యవసర సమయాల్లో ఆదుకునేందుకు పొదుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. అనుకోని ప్రమాదాలు ఇతరత్రా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలైనప్పుడు మూడు లేదా ఆరు నెలల జీతాన్ని అత్యవసర నిధి కింద సిద్ధంగా పెట్టుకోవాలి. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పదవీ విరమణ వరకు జీవితం సజావుగా సాగేందుకు విడిగా కొంత మొత్తాన్ని దాచుకోవాలి. లేదంటే వృద్ధాప్యంలో కూడా కాసుల కోసం కష్టాల పడాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.