1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : బుధవారం, 30 నవంబరు 2022 (11:01 IST)

డిసెంబర్ 2022 మాస ఫలితాలు.. ఈ రాశుల వారికి యోగం..

Astrology
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
అన్ని రంగాల వారీకీ యోగదాయకమే. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సోదరీ సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. గృహ మరమ్మతులు చేపడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. వాయిదా పడుతూ వస్తున్న మొక్కులు తీర్చుకుంటారు. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతికూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. రుణయత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ వహించాలి. గృహమార్పు అనివార్యం. దంపతుల మధ్య సఖ్యత లోపం. సామరస్యంగా మెలగాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యపరీక్షలు అవసరం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వస్త్ర, పచారీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. మీ నిర్లక్ష్యం ఇబ్బందికి దారితీస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. ప్రయాణంలో జాగ్రత్త. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. కార్యసాధనకు మరింత శ్రమించాలి. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. సమర్ధతకు ఏమంత గుర్తింపు ఉండదు. ఖర్చులు విపరీతం. ధనసమస్యలెదురవుతాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. కుటుంబీకులు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త. పాతమిత్రుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులు అనుకూలించవు. వేడుకల్లో ఆందరినీ ఆకట్టుకుంటారు.. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. సమర్థతను చాటుకుంటారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆపన్నులకు సాయం అందిస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. కీలక పత్రాలు అందుకుంటారు. గృహ నిర్మాణాలకు ఆమోదం లభిస్తుంది. పెట్టుబడులకు అనుకూలం. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అజ్ఞాతవ్యక్తులతో జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికస్థితి నిరాశానకం. రుణఒత్తిళ్లతో మనశ్శాంతి లోపిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. మనోనిబ్బరంతో మెలగండి. ఆప్తులు సాయం అందిస్తారు. గృహమార్పు నిదానంగా సత్ఫలితమిస్తుంది. ఆప్తులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. సహోద్యోగులతో జాగ్రత్త. సాంకేతిక, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధి పథకాలు చేపడతారు. 
 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ మాసం యోగదాయకం. ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. గుట్టుగా వ్యవహరించండి. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. దంపతుల మధ్య అవగాహన లోపం. మీ శ్రీమతి తరఫు బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు. 
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంకల్పం నెరవేరుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. విలసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. సోదరుల వైఖరిలో మార్పు వస్తుంది. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. వివాదాలు సద్దుమణుగుతాయి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ప్రారంభోత్సవాలకు అనుకూలం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. అధికారులకు పనిభారం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు, పనులు సాగవు. సంతానం చదువులపై దృష్టి పెట్టండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు సంఘ వ్యవహారాలతో తీరిక ఉండదు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
ధనుర్ రాశి: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు మెరుగుపడతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషపరుస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరచరాస్తుల విక్రయంలో మెలకువ వహించండి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు శుభయోగం. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. వస్త్ర, పచారీ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. సరుకు నిల్వలో జాగ్రత్త. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ మాసం నిరాశాజనకం. కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. సమర్ధతకు ఏమంత గుర్తింపు ఉండదు. అనుకోని ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. ఈ చికాకులు తాత్కాలికమే. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. మీ శ్రీమతి తీరును గమనించి మెలగండి. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలించదు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. ఉపాధి పథకాలు చేపడతారు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వస్త్రవ్యాపారాలు ఊపందుకుంటాయి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ మాసం శుభదాయకం. వివాహయత్నం ఫలిస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. పెట్టిపోతల్లో మెలకువ వహించండి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అవసరమవుతాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసాన్నిస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
మీనరాశి పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అనుకున్నది సాధిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. పనులు సానుకూలమవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఆప్తులను వేడుకకు ఆహ్వానిస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదామార్పు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. ప్రయాణం సాఫీగా సాగుతుంది.