శనివారం, 4 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సిహెచ్
Last Modified: గురువారం, 15 ఏప్రియల్ 2021 (22:45 IST)

ఇవి తీసుకుంటే పంటి నొప్పి సమస్య మాయం

కాఫీలు, టీలు, శీతల పానీయాలు... ఇలా చెప్పుకుంటూ పోతే అతివేడి, అతిచల్లని పానీయాలను తీసుకోవడం వల్ల దంతాలకు సమస్య ఏర్పడుతుంది. అలాగే రాత్రిపూట భోజనం అయ్యాక చాలామంది దంతాలను శుభ్రపరచుకోవడం చేయరు. దీనితో దంత సమస్యలు ఉత్పన్నమవుతాయి. కొందరికి చిగుళ్లు బలహీనంగా వుండటం మూలంగా దంత సమస్యలు వస్తుంటాయి. వీటిని అధిగమించేందుకు ఆయుర్వేదంలో చిట్కాలు వున్నాయి. అవేంటో చూద్దాం.
 
చెట్టు మీదే ఎండిన రామ్ములకాయల్ని సంగ్రహించి, వాటి విత్తనాలను భద్రపరచుకోవాలి. పిప్పి పళ్లతో విపరీతంగా బాధపడేవారికి ఇలా చేయాలి. నిప్పులపై మైలతుత్తం పొడిని ములక్కాయ విత్తనాలను కలిపి వేస్తే ఘాటైన పొగ వస్తుంది. కళ్లు మూసుకొని ఆ పొగను నోటిలోకి పీల్చి బందిస్తే వెంటనే పంటి రంధ్రం లోంచి క్రిములు రాలి పడతాయి. దీనితో నొప్పినుంచి ఉపశమనం కలుగుతుంది.
 
పిడికెడు ఉత్తరేణి ముదురాకులు తీసుకొని రసం తీసి, కొంచెం సారా కలిపి పంటి నొప్పి ఏ వైపున ఉంటే ఆ వైపు చెవిలో వేసుకొని ఎండలో 10 నిమిషాలు పడుకుంటే పుచ్చిన దంతంలోని క్రిములు చెవిలోంచి బయటకు వస్తాయి.
 
అరస్పూన్ లవంగాలు, కొద్దిగా కొబ్బరినూనె, టీస్పూన్ మిరియాలపొడి, చిటికెడు ఉప్పు వీటిని అన్నింటిని కలిపి పుచ్చిన పంటిపై రాస్తే చిటికెలో నొప్పి మాయం అవుతుంది.
 
వెల్లుల్లిలో యాంటీబయోటిక్ ప్రోపర్టీస్ ఉంటాయి. 3 వెల్లుల్లి రెబ్బలను మెత్తగా చేసి దానికి చిటికెడు ఉప్పును కలిపి పుచ్చి పంటిపై పెడితే తక్షణం ఉపశమనం కలుగుతుంది.
 
జామ ఆకులలో యాంటీ ఇన్ప్లోమెంట్రీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రోపర్టీస్ ఉంటాయి. పంటి నొప్పితో బాధపడేవారు 2 లేక 3 జామ ఆకుల్ని శుభ్రంగా కడిగి తినటం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.