మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : బుధవారం, 5 సెప్టెంబరు 2018 (13:30 IST)

చెరకు రసంలో తేనెను కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

బొప్పాయి గుజ్జులో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. పాలలో గంధపు పొడిని కలుపుకుని

బొప్పాయి గుజ్జులో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. పాలలో గంధపు పొడిని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. తద్వారా ముఖం కోమలంగా మారుతుంది.
 
నిమ్మరసంలో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై గల మెుటిమలు, నల్లటి వలయాలు తొలగిపోతాయి. నారింజ తొక్కల పొడిలో కొద్దిగా పెరుగు, తేనె కలుపుకుని పేస్టులా చేసుకుని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
 
చెరకు రసంలో తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో ముఖం మృదువుగా మారుతుంది. నువ్వుల నూనెలో పసుపు, మెుక్కజొన్న పిండి కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తద్వారా ముఖం తాజాగా మారుతుంది.