గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2022 (12:47 IST)

ఏపీలో డీఎస్సీ 2022 నోటిఫికేషన్ విడుదల

dsc notification
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ 2022 నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీచేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 502 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది. 
 
ఈ పోస్టుల్లో స్కూలు అసిస్టెంట్లు, ఎస్.జి.టి, మ్యూజిక్ టీచర్లు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేషన్, ఏపీ మోడల్ స్కూల్స్, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీల నియామకాలు చేపట్టనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను https://cse.ap.gov.in/ అనే వెబ్ సైటులో ఉంచారు.