బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By
Last Updated : మంగళవారం, 23 అక్టోబరు 2018 (13:17 IST)

చపాతీ పిండికి.. అరటిపండ్ల గుజ్జు కలిపితే?

చపాతీ పిండి కలిపేటప్పుడు అందులో రెండు  పండ్ల అరటి గుజ్జును కలిపితే.. చపాతీలు మెత్తగా ఉండటమే గాక చాలాసేపు గట్టిపడకుండా ఉంటాయి. చపాతీ పిండి కలిపేటప్పుడు అందులో గుప్పెడు శెనగపిండి కలిపితే చపాతీ మంచి రంగు, వాసన వస్తుంది. చపాతీ పిండిలో వంద గ్రాముల తాజా వెన్న కలిపితే చపాతీలు మెత్తగా రావటమే గాక రుచి అద్భుతంగా ఉంటుంది. 
 
పప్పు వండేటప్పుడు నీళ్లు ఎక్కువ పోసి వండి, ఆ వేడి పప్పు నీటిని గోధుమ పిండికి కలిపి చపాతీ చేస్తే మెత్తగా రావటమే గాక పప్పులోని పోషకాలూ అందుతాయి. చపాతీలు మెత్తగా ఉండి, పూరీల్లా బాగా పొంగాలంటే గోధుమ పిండిలో కొంచెం పెరుగు లేదా మజ్జిగ కలిపితే చాలు.
 
చపాతీలు చేసేటప్పుడు పొడి పిండి ఎక్కువగా వాడకపోవడం, చేయగానే హాట్ బాక్స్‌లో వేసుకుంటూ పోవటం వల్ల అవి వేడిగా, మెత్తగా ఉంటాయి. చపాతీ పిండి కలుపుకుని బాగా మర్దన చేసి తడి బట్టలో చుట్టి పెట్టి అరగంట తర్వాత చపాతీలు చేస్తే అవి పొంగి, మెత్తగా వస్తాయి.