గురువారం, 21 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2023 (23:19 IST)

వంట గ్యాస్‌ను ఆదా చేయాలంటే.. ఈ సింపుల్ టిప్స్ పాటించాల్సిందే..

Stove
గ్యాస్ ధరలు రోజురోజుకు మండిపోతున్నాయి. ఈ ధరలు చూసి మధ్యతరగతి మండిపడుతున్నారు. అందుకే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే వంట గ్యాస్ ఎక్కువ కాలం ఉంటుంది. సిలిండర్‌ను ఆదా చేయవచ్చు. గ్యాస్ సిలిండర్ రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. 
 
గ్రామాల్లో కట్టెల పొయ్యిలు ఉన్నప్పటికీ గ్యాస్ వాడకం పెరిగింది. నగరాల్లో నివసించే ప్రజలు సిలిండర్లు లేకుండా తమ జీవితాన్ని ఊహించలేరు. గ్యాస్ అయిపోతే ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ ధర రోజురోజుకూ పెరుగుతోంది. 
 
అలాంటి వాతావరణంలో గ్యాస్ సిలిండర్‌ను చాలా తక్కువగా వాడాలి. ఎలా ఆదా చేయాలనేది తెలుసుకుందాం. గ్యాస్ స్టవ్‌లోని బర్నర్‌ను ఎప్పుడూ శుభ్రంగా, మురికి లేకుండా ఉంచాలి. ధూళి గ్యాస్‌ను అంటుకుంటే గ్యాస్ ఎక్కువగా వాడాల్సి వుంటుంది. 
 
బర్నర్ మురికిగా ఉంటే గ్యాస్ లీకేజీ కూడా సాధ్యమే. దీనివల్ల కూడా సిలిండర్ త్వరగా తరుగుతుంది. గ్యాస్ స్టవ్ బర్నర్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి. తడి పాత్రలను గ్యాస్ సిలిండర్‌పై వుంచకూడదు. 
 
వంటపాత్రలను శుభ్రం చేశాక.. వాటిని తడిబట్టతో తుడిచిన తర్వాతే వాడాలి. అలాగే వండేటప్పుడు మూత పెట్టండి. కూరగాయలు వండాలన్నా, అన్నం వండాలన్నా మూత పెడితే త్వరగా ఆహారం ఉడుకుతుంది. కావాలంటే కుక్కర్‌ని కూడా ఉపయోగించవచ్చు.