యాషెస్ టెస్ట్ సిరీస్ : ఇంగ్లండ్ చిత్తు.. ఆస్ట్రేలియా ఘన విజయం
యాషెస్ టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా విజయఢంకా మోగించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 185 పరుగులు తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగంలో సమిష్టిగా రాణించి అదరగొట్టారు. ఫలితంగా ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్ ట్రోఫీని మళ్లీ నిలబెట్టుకుంది.
మ్యాచ్ చివరి రోజైన ఆదివారం 383 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు 197 పరుగులకు కుప్పకూలింది. ఆసీస్ పేసర్లు ప్యాట్ కమిన్స్(4/43), హజిల్‌వుడ్(2/31) రాణించారు. ఓవర్‌నైట్ స్కోరు 18/2 వద్ద ఐదో రోజు ఆటకు దిగిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మ్యాచ్‌ను డ్రా చేసేందుకు తీవ్రంగా శ్రమించారు.
డెన్లీ(123 బంతుల్లో 53), జేసన్ రాయ్(67 బంతుల్లో 31), బెయిర్‌స్టో(61 బంతుల్లో 25), బట్లర్(111 బంతుల్లో 34) డిఫెన్స్‌తో ప్రతిఘటించినా జట్టును ఒడ్డుకు చేర్చలేక పోయారు. మ్యాచ్ ఆఖరులో ఓవర్టన్(21) సైతం 105 బంతులాడి లీచ్(51 బంతుల్లో 12)తో కలిసి శ్రమించాడు.
ఈ జోడీని ఆసీస్ పార్ట్‌టైం బౌలర్ లబుషేన్ విడదీయగా... చివరి వికెట్‌గా ఓవర్టన్‌ను హజిల్‌వుడ్ వెనక్కి పంపాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 185 పరుగుల తేడాతో విజయబేరీ మోగించింది.