శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 నవంబరు 2019 (17:55 IST)

పింక్ బాల్ టెస్టు : ప్రేక్షకులకు డబ్బులు వాపస్ ఇస్తున్న క్యాబ్

భారత్‌లో తొలిసారి డే అండ్ నైట్ టెస్ట్ జరిగింది. ఈ పిక్ బాల్ టెస్టుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదిక అయింది. భారత్ - బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. ఐదు రోజుల పాటు సాగాల్సిన ఈ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. అయితే, ఈ మ్యాచ్ ఐదు రోజుల పాటు జరిగితే వచ్చే మజా వేరుగా ఉంటుందని కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో, చివరి రెండు రోజులకు మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) నిర్ణయించుకుంది. నాలుగు, ఐదు రోజులకు మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసినవారికి నగదు వాపస్ చేసే ప్రక్రియ షురూ అయిందని క్యాబ్ అధికారులు వెల్లడించారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి మెసేజ్ లు పంపించామని తెలిపారు. 
 
కాగా, ఈ టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. అలాగే, భారత ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా సెంచరీతో మరోమారు సత్తా చాటాడు. ఫలితంగా స్వదేశంలో పింక్ బాల్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది.