గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 ఫిబ్రవరి 2026 (22:40 IST)

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సూపర్-8 జట్లకు డబుల్ బొనాంజా... ఏంటది?

icc t20 world cup
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ పోటీలకు భారత్, శ్రీలంక దేశాలు ఆతిథ్యమివ్వగా, ఈ టోర్నీలో లీగ్ మ్యాచ్‌లు రేపటితో ముగియనున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి సూపర్-8 దశ పోటీలు ప్రారంభంకానున్నాయి. ప్రస్తుతం సూపర్-8కు గ్రూపు ఏ నుంచి భారత్, పాకిస్తాన్, గ్రూపు బి నుంచి శ్రీలంక, జింబాబ్వే, గ్రూపు సి నుంచి వెస్టిండీస్, శ్రీలంక, గ్రూపు డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు అడుగుపెట్టాయి. ఈ టోర్నమెంట్ నిబంధనల ప్రకారం ఈ 8జట్లు తదుపరి పొట్టి ప్రపంచ కప్‌కు ఆటోమేటిక్‌గా క్వాలిఫై అయ్యాయి. 
 
2028 ప్రపంచ కప్ ఆతిథ్య దేశాల హోదాలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు నేరుగా 2028 టీ20 వరల్డ్ కప్‌కు అర్హత లభిస్తుంది. దీంతో మొత్తం 20 బెర్తులు ఖరారైనట్టే. మరో మూడు జట్లను ఐసీసీ టీ20 ర్యాంకుల ఆధారంగా ఎంపిక చేస్తారు. మార్చి 9 నాటి ర్యాంకింగ్స్ ప్రకారం బంగ్లాదేశ్, ఆప్గనిస్తాన్, ఐర్లాండ్ జట్లు ఈ స్థానాల్లో నిలిచే అవకాశం ఉంది. మిగిలిన 8 స్థానాలకు రీజనల్ క్వాలిఫయర్ ద్వారా భర్తీ చేయనున్నారు. 
 
ఇదిలావుంటే, ప్రస్తుత టోర్నీలో అసలైన మజా ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. సూపర్ 8 దశ పోటీలు 21 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో టైటిల్‌పై డిఫెండింగ్ చాంపియన్ భారత్ మాజీ విజేతలైన వెస్టిండీస్, ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు కన్నేశాయి. కాగా, ఈ టోర్నీలో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన జింబ్వాబ్వే సూపర్ 8లోకి అడుగుపెట్టడంతో పాటు అందరిని దృష్టిని ఆకర్షించిన విషయం తెల్సిందే.