కాగితం ఎలా వచ్చింది?

Last Updated: శుక్రవారం, 30 ఆగస్టు 2019 (16:57 IST)
ప్రాచీన ఈజిప్టియన్లు నైలు నదీ తీరాల్లో పెరిగే పాపిరస్ అనే ఒక రకం గడ్డి మొక్క నుంచి రాయడానికి అనువైన కాగితం వంటి దాన్ని తయారు చేశారు. ఆ "పాపిరస్" అనే ఈజిప్ట్ పదం నుంచే "పేపర్" అనే పదం పుట్టింది.

ఆ తరువాత చాలా కాలానికి చైనీయులు చెక్కతో గుజ్జు తయారుచేసి, దాన్ని బల్లపరుపుగా పరిచి, ఆరబెట్టి, కాగితాన్ని తయారు చేయడం ప్రారంభించారు. అదే పద్ధతిని అరబ్బులు ఇంకాస్త మెరుగుపరిచి, మెరుగైన కాగితాన్ని తయారు చేసారు.

ఆ తరువాత ఆధునిక పద్ధతులు వచ్చి, రకరకాల కాగితాలు తయారయ్యాయి. అయితే పాపిరస్ మొక్క వల్లే మనకు పేపర్ వచ్చిందని గుర్తుంచుకోవాలి.

పాపిరస్ నుంచి కాగితాన్ని తయారు చేయడమే కాకుండా చాపలు, బుట్టలు, తాళ్లు, చెప్పులు, పడవలు తయారు చేసేవారు. ఈ మొక్క వేరుని ఔషధంగానూ, ఆహారంగానూ, సుగంధద్రవ్యంగానూ ఉపయోగించేవారు.దీనిపై మరింత చదవండి :