గ్రహానికి ఉపగ్రహానికి ఉన్న తేడా ఏమిటి?
నిర్వచనము ప్రకారము సూర్యుని చుట్టూ తిరిగేవి గ్రహాలు , గ్రహాల చుట్టూ తిరిగేవి ఉపగ్రహాలు. గ్రహాలు సైజు లో పెద్దవి. ఉపగ్రహాలు సైజులో చిన్నవి. గ్రహాలకు ఉపగ్రహాలకు కూడా స్వయం ప్రకాశశక్తి లేదు. రెండూ రాతిగోళాలే. ఆ గొళాలు సూర్యుని కాంతిని పరావర్తనం చిందించి ప్రకాశస్తాయి. గ్రహాలలో కొన్నింటిమీద వాతావరణం ఉంటుంది. ఉపగ్రహాలకు వాతావరణం లేదు. వాతావరణం కలిగి సైజులో పెద్దది అయినది భూమి. దాని ఉపగ్రహము చంద్రుడు.
మనము ప్రయోగించగా భూకక్ష్యలో పరిభ్రమించేవి కృత్రిమ ఉపగ్రహాలు. వీటిద్వారానే నేడు మన కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం నడుస్తోంది.
గ్రహణాలు ఎలా ఏర్పడతాయి?
సూర్యుడు ,చంద్రుడు , భూమి ఒకే సరళరేఖ పైకి వచ్చినపుడే గ్రహణాలు ఏర్పడుతాయి . చంద్ర గ్రహణము పౌర్ణమి నాడు , సూర్య గ్రహణము అమావాస్య నాడు ఏర్పడతాయి . కాంతి పడిన ప్రతి వస్తువుకి నీడ ఏర్పడుతుంది . . అంతరిక్షములో సూర్యుని కాంతి భూమి ,చంద్రుల పై పడినపుడు వాటి నీడలు కుడా అలాగే ఏర్పడతాయి కాని ఆ నీడపడే చోటుకి ఏ వస్తువు (గోడలు లాంటివి ) ఉండవు కావున ఆవి కనిపించవు. ఈ నీడలు వల్లే గ్రహణాలు ఏర్పడుతాయి .
చంద్ర గ్రహణము
భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటే , ఆ భూమి చంద్రుడి తో సహా సూర్యుని చుట్టూ తిరుగుతోంది . ఇలా తిరిగే భూమి పై సూర్యకాంతి నిరంతరము పడుతూనే ఉంటుంది . ఆ కంటి పడే ప్రాంతాల్లో పగలని , పడని ప్రాంతాల్లో రాత్రని అనుకుంటాం ,.. సూర్య కంటి పడినపుడు భూమికి వెనక దాని నీడ ఏర్పడుతుంది.
కాని అక్కడంతా అంతరిక్షము కాబట్టి ఏమీ కనబడదు , ఆ నీడ పడే ప్రాంతం లోకి చంద్రుడు వచ్చాడనుకోండి .. ఆ చద్రుడే ఓ గోడలా అడ్డు ఉండడము తో భూమి నీడ దానిపై పడుతుంది . ఆ నీడ పాడుచున్నప్రనటం మేర చంద్రుడు కనిపించదు ... కాబట్టి దాన్నే చంద్రగ్రహణము అనుకుంటాము.
సూర్య గ్రహణము
భూమి పైకి సూర్య కంటి పడుతున్నపుడు ఆ కంటికి అడ్డుగా చంద్రుడు వచ్చదుకోండి ... అప్పుడు చద్రుడి నీడ ఏర్పడి అది భూమి మీద పడుతుంది . భూమి పై ఆ నీడ పరుచుకున్న ప్రాంతం లో ఉన్నవారు తలెత్తి పైకి చుస్తే సూర్యుడు కొంత భాగము కనిపించడు , అదే సూర్య గ్రహణము అంటాము . చంద్రుదు కనిపించని రోజు అమావాస్య అవుతుంది.
భూమి నుంచి చంద్రు ఉన్న దూరానికి సరిగ్గా 400 రెట్లు దూరాన సూర్యుడు ఉన్నాడు. అంతేకాకుండా చంద్రుడు వ్యాసానికి సరిగా 400 రెట్లు పెద్దదిగా సూర్యుడి వ్యాసము ఉన్నది . అందుకే భూమి నుంచి చంద్రుడు , సూర్యుడు ఒకే పరిమాణము లో కనిపిస్తాయి.