1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 12 జనవరి 2024 (22:45 IST)

గుండెను పాడు చేసే ఆహార పదార్థాలు ఏమిటి?

Heart
మనిషి అవయవాల్లో గుండె పనితీరు ఎంతో ముఖ్యమైనది. గుండె ఆగితే ఆ మనిషి ప్రాణం పోయినట్లే. అందువల్ల గుండెను ఆరోగ్యంగా వుంచుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని పాడుచేసే ఆహారాలను దూరంగా పెట్టాలి. అవేమిటో తెలుసుకుందాము.
 
జంతువులకు చెందిన ఎరుపు మాంసంలో వుండే కొవ్వు మనిషి గుండె, ధమనులకు చాలా చెడ్డది. కనుక దాన్ని బాగా పరిమితంగా తినాలి.
ఫ్రెంచ్ ఫ్రైస్, ఇతర వేయించిన ఆహారాలు గుండెకి చేటు చేస్తాయి.
చక్కెర పానీయాలు, పంచదారతో దట్టించిన స్వీట్లు గుండెకి మంచివి కావు.
బంగాళాదుంప చిప్స్, చిరుతిండి ఆహారాలు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
పూర్తి కొవ్వు పాల ఉత్పత్తులు గుండెకి ఎంతమాత్రం ఆరోగ్యం కాదు.
బాగా వేయించిన వస్తువులు, కుకీలు, పేస్ట్రీలు ఎంతో నష్టం చేస్తాయి.
బాగా ఉప్పు జోడించిన ఆహారాలు తినకుండా వుండాలి.