శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (15:28 IST)

మెంతులు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి, ఎలాగంటే? (video)

మెంతులు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. 150 గ్రాముల మెంతిపొడి, 50 గ్రాముల శొంఠి పొడి కలిపి ఉంచుకొని రోజూ ఉదయం, సాయంత్రం పూటకు 2 నుంచి 3 గ్రాములు పొడిని తగినంత తేనెతో సేవిస్తూ వుంటే మంచి కొలెస్ట్రాల్ పెరిగి, చెడు కొలెస్ట్రాల్ తగ్గి చక్కటి ఆరోగ్యానికి దోహదపడుతుంది. అంతేకాక ఈ ఔషధ సేవనం వల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి.
 
అధిక చెమటకు...
మెంతులు, నల్ల ఉలవలు, కచోరాలు, కరక్కాయ పెచ్చులచూర్ణాలను ఒక్కొక్కటి 100 గ్రాముల చొప్పున కలిపి ఉంచుకుని రోజూ ఒకసారి తగినంత పొడిలో తగినన్ని నీళ్లు చేర్చి పేస్టులా చేసి లేపనం చేసుకుని రెండు గంటలాగి స్నానం చేస్తుంటే అధిక చెమట సమస్యతో పాటు శరీర దుర్గంధ సమస్య కూడా తగ్గుతుంది.
 
శిరోజాలు బాగా పెరిగేందుకు..
మెంతులు, మినుములు, ఉసిరిక పెచ్చుల చూర్ణాలను ఒక్కొక్కటి 100 గ్రాముల చొప్పున తీసుకుని అన్నింటిని కలిపి సీసాలో నిల్వ వుంచుకుని వారంలో రెండుసార్లు రాత్రిపూట తగినంత పొడిని తీసుని అది బాగా మునిగేట్లు నిమ్మరసం పోసి ఉదయం వరకూ నానించి పదార్థన్నంతా బాగా కలిపి తలకు పట్టించి రెండు గంటలు ఆగి కుంకుడు లేదా శీకాయ పొడితో తలస్నానం చేస్తుండాలి. గర్భస్రావం కలుగజేసే గుణం వున్నందు వల్ల గర్భవతులు మెంతులు వాడకపోవడం మంచిది.