బంగాళాదుంప చిప్స్.. క్యాన్సర్లపై పోరాడుతాయా?
చిప్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉన్నప్పటికీ అవి తినాలంటే భయపడుతుంటారు. శరీరంలో ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోతుందని మరియు స్థూలకాయం వస్తుందని వాటి జోలికి వెళ్లరు. కానీ బంగాళాదుంప చిప్స్ తినడం వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఇవి కొన్ని రకాల క్యాన్సర్‌లపై పోరాడగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ చిప్స్‌లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందనీ, ఇది క్యాన్సర్ వృద్ధిలో కీలక పాత్ర పోషించే ప్రమాదకరమైన ఫ్రీ ర్యాడికల్స్‌ను అడ్డుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
సి విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునే వారికి అన్నవాహికా, జీర్ణాశయ, రొమ్ము క్యాన్సర్‌ల బారినపడే ప్రమాదం తక్కువగా ఉంటుందని పౌష్టికాహార నిపుణులు అంటున్నారు. అలాగే చిప్స్ తినడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందని వారు చెబుతున్నారు.