సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 15 జూన్ 2023 (15:30 IST)

టీతో పొరబాటున కూడా తినకూడని 7 ఆహారాలు, ఏంటవి?

టీ. అవును ఈరోజుల్లో కాఫీ, టీ తాగనివారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ఐతే పానీయాలతో కొన్ని పదార్థాలను తీసుకోరాదు. ముఖ్యంగా టీ తీసుకునేటపుడు కొన్ని పదార్థాలను తినకూడదు. అవేమిటో తెలుసుకుందాము. పులిచిపోయిన పిండితో చేసిన స్నాక్స్‌ను టీతో కలిపి తింటే ఎసిడిటీ వస్తుంది. టీతో పాటు పుల్లగా వుండే ఉసిరి, నారింజ తదితర పండ్లను తినకూడదు.
 
టీలో క్రీమ్ జోడించడం వల్ల యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలను తగ్గించవచ్చు. టీతో పాటు తీపి ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. టీతో పాటు వేయించిన ఆహారాన్ని తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. పసుపు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతో టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. టీతో పాటు గింజలు తినడం ఆరోగ్యంపై ప్రమాదకరమైన ప్రభావాలను కలిగిస్తుంది.