సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (13:05 IST)

చెన్నై ఓడినా ధోనీకి క్రేజ్ తగ్గలేదు.. ధోనీ ముందు హెలికాప్టర్ షాట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ జట్టు గెలుపును నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ధోనీ జట్టు ఓడినా ఆయనకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ధోనీ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు.. మైదానం మొత్తం ధోనీ పేరుతో మారుమోగింది.


ఓడినా ధోనీపై వున్న క్రేజ్ తగ్గలేదు. ధోనీ పేరును చెన్నై ఫ్యాన్స్ స్మరిస్తూనే గడిపారు. ముంబైలో ఈ మ్యాచ్ జరిగినా.. ధోనీ క్రేజ్ చూస్తుంటే.. ముంబైలో ఈ మ్యాచ్ జరిగినట్లు లేదని.. చెన్నైలో జరిగినట్లుందని క్రీడా పండితులు అంటున్నారు.
 
అలాగే మిస్టర్‌ కూల్‌ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఓడించిన ముంబై ఇండియన్స్‌.. ఐపీఎల్‌ చరిత్రలో 100వ విజయాన్ని నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. సొంత మైదానంలో ఈ చిరస్మరణీయ విజయాన్ని అందుకోవడంలో ముంబై ఆటగాడు హార్దిక్‌ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌తో.. ఆ తర్వాత బౌలింగ్‌తో అదరగొట్టి ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టాడు. 
 
ముఖ్యంగా చివరి ఓవర్లో బ్రేవో బౌలింగ్‌ను చీల్చి చెండాడిన తీరు.. అతడి బౌలింగ్‌లో పాండ్యా బాదిన ‘ధోని స్పెషల్‌- హెలికాప్టర్‌ షాట్‌’ మ్యాచ్‌ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. ఈ విషయం గురించి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పాండ్యా మాట్లాడుతూ... ధోని భాయ్‌ ముందు హెలికాప్టర్‌ షాట్‌ కొట్టడం నాకు చాలా ప్రత్యేకం. నాకు తెలిసి.. ఈ షాట్‌ గురించి ఎంఎస్‌ నన్ను కచ్చితంగా మెచ్చుకుంటాడని ఆశిస్తున్నానని హర్షం వ్యక్తం చేశాడు.