శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 16 జులై 2023 (10:26 IST)

కన్వారియా యాత్రలో విషాదం.. విద్యుదాఘాతానికి శివభక్తుల మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. కన్వారియా యాత్రలో పాల్గొన్న ఐదుగురు శివ భక్తులు ప్రాణాలు కోల్పోయారు. హైటెన్షన్ విద్యుత్ తీగలు తలగడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన మీరట్ జిల్లాలో జరిగింది.
 
కాన్వార్ యాత్రలో పాల్గొన్న భక్తులు హరిద్వార్‌లో పవిత్ర గంగా జలాలను తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. భజనలు చేసుకుంటూ వస్తున్న వీరి వాహనం మీరట్ జిల్లాలోని భావన్‌పుర్‌లోని రాలీ చౌహాన్‌ గ్రామ సమీపానికి చేరగానే.. తక్కువ ఎత్తులో వేలాడుతున్న హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలకు తగిలింది.
 
దీంతో వాహనం సమీపంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు స్థానికులు.. పవర్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసి విద్యుత్‌ సరఫరా నిలిపివేయాల్సిందిగా కోరే లోపే.. ప్రాణ నష్టం జరిగిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మరో ఐదుగురిని సమీప ఆస్పత్రులకు తరలిచారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.