బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

19-03-2020 గురువారం దినఫలాలు - సాయిబాబాను ఆరాధించడం వల్ల శుభం

మేషం : దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కదురదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. గృహమార్పు యత్నం అనుకూలిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి పురోభివృద్ధి కానవస్తుంది. విద్యార్థులు మానసికంగా స్థిమితపడతారు. ప్రైవేట్ ఫైనాన్సులో మదుపు, వ్యక్తులకు రుణం ఇవ్వడం క్షేమంకాదు. 
 
వృషభం : భాగస్వాముల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. స్త్రీల మనోభావాలకు, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉల్లి, బెల్లం, పసుపు, కంది, మిర్చి వ్యాపారస్తులకు స్టాకిస్టులకు కలిసివస్తుంది. పత్రికా సిబ్బందికి మార్పులు అనుకూలిస్తాయి. ఉత్తరప్రత్యుత్తరాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి.
 
మిథునం : ఆకస్మిక ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. అధ్యాయపకులకు పురోభివృద్ధి. విద్యార్థులు కొన్ని నిర్భందాలకు లోనవుతారు. ఒక అనుభవం మీకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది. ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లు టార్గెట్లను అధికమిస్తారు. స్త్రీలకు ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్త అవసరం. 
 
కర్కాటకం : విద్యార్థులకు మిత్రబృందాలు, వ్యాపకాలు అధికం కాగలవు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. అంతగా పరిచయం లేని వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. స్థిరాస్తుల అమ్మకానికై చేయు యత్నాలు వాయిదాపడతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో అప్రమత్తత అవసరం. 
 
సింహం : మీ సంతానం విద్యా విషయాలు ఊరట కలిగిస్తాయి. ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లకు సదావకాశాలు లభిస్తాయి. రాపడికి మించిన ఖర్చులెదురైనా సమయానికి కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, ఇతరాత్రా చికాకులు అధికమవుతాయి. దైవారాధన పట్ల ఆశక్తి పెరుగుతుంది. 
 
కన్య : శాస్త్ర రంగాల వారికి పరిశోధనలు, ప్రయోగాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. గృహ నిర్మాణాలు, మరమ్మతులకు అనుకూలం. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. భాగస్వామిక చర్చలు, సంప్రదింపులకు అనుకూలం. స్త్రీలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. 
 
తుల : వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ఇసుక కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. ముఖ్యుల గురించి ఆందోళన చెందుతారు. ఆత్మీయుల కలయిక సంతోషం కలిగిస్తుంది. తలపెట్టిన పనులు అతికష్టంమ్మీద పూర్తిచేస్తారు. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులు ఓర్పు, నేర్పుతో విజయాన్ని సాధించగలరు. మధ్యవర్తిత్వం వహించడం వల్ల మాటపడక తప్పదు. మార్కెట్ రంగాలవారికి ఒత్తిడి పెరుగుతుంది. పాత వస్తువుల పట్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. దైవదర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
ధనస్సు : నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. జీవితభాగస్వామిక ద్వారా ఆర్థిక లాభం పొందుతారు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు స్వీయ పర్యవేక్షణ ముఖ్యం. 
 
మకరం : కటుంబీకుల కోరికలు తీరుస్తారు. చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. భాగస్వామిక చర్చల్లో మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలం. కీలకమైన సమస్యలు పరిష్కారం కావడంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. 
 
కుంభం : కోర్టు వ్యవహారాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. వైద్యులు అరుదైన ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ఒక కార్యం నిమిత్తం ప్రయాణం చేస్తారు. పత్రికా సంస్థలలోని వారికి ఊహించని సమస్యలెదురవుతాయి. దంపతుల మధ్య చిన్నచిన్న కలహాలు చికాకులు తప్పవు. 
 
మీనం : కొంతమంది మీ నుంచి ధనం లేక ఇతరాత్రా సహాయం అర్థిస్తారు. రావలసిన ధనం వసూలు కావడంతో మీ ఆలోనచలు పలు విధాలుగా ఉంటాయి. ముఖ్యుల రాకపోకలు అధికమవుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ప్రేమికుల అత్యుత్సాహం అనర్ధాలకు దారితీస్తుంది.