మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : ఆదివారం, 9 జూన్ 2019 (06:39 IST)

09-06-2019 మీ రాశిఫలాలు : విద్యార్థులు ఇతరుల కారణంగా...

మేషం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలను ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులు సమర్ధంగా పనిచేసి పై అధికారులను మెప్పిస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసిరాగలవు. వృధా ఖర్చులు, అనుకోని చెల్లింపుల వల్ల ఆటుపోటులుతప్పవు.
 
వృషభం : ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకున్నంత సంతృప్తి నివ్వవు. అలౌకిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఆర్ధిక విషయాల పట్ల అవగాహన పెంచుకుంటారు. మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం మంచిది కాదని గమనించండి.
 
మిథునం : విద్యార్థులు ఇతరుల కారణంగా మాటపడవలసి వస్తుంది. ఉద్యోగస్తులు వ్యాపార రీత్యా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు పోటి పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు.
 
కర్కాటకం : రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాల పట్ల దృష్టిసారిస్తారు. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్త్రీలు నూతన పరిచయస్తులతో మితంగా సంభాషించటం మంచిది. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం.
 
సింహం : వస్త్ర, బంగారు, వెండి, రత్న వ్యాపారస్తులకు లాభదాయకం. మీ ప్రియతముల కోసం, సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఇతరులను అతిగా విశ్వసించటం వల్ల నష్టపోయే ప్రమాదముంది జాగ్రత్త వహించండి. విద్యార్థులు అధిక ఉత్సాహం ప్రదర్శించడం వల్ల సమస్యలకు లోనవుతారు.
 
కన్య : ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు సఫలీకృతులవుతారు. పాత్రికేయులకు ఒత్తిడి, పనిభారం అధికం. బంధువుల మధ్య అపోహలు తొలగిపోయి ఆప్యాయతలు మరింత బలపడతాయి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు తమ ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారులకు అన్నివిధాలా కలిసిరాగలదు.
 
తుల : సోదరీ, సోదరుల మధ్యసమస్యలు తలెత్తుతాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచివి కాదని గమనించండి. సన్నిహితులు నుంచి ఆకర్షణీయమైన కానుకలు అందుకుంటారు. ఐరన్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి లాభదాయకం. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి. ఆలయాలను సందర్శిస్తారు.
 
వృశ్చికం : ఉపాధ్యాయులు ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. వచ్చిన సొమ్మును పొదుపు పథకాలవైపు మళ్ళించండి. తప్పనిసరి చెల్లింపులు వాయిదా వేయటంవల్ల ఇబ్బందు లెదుర్కుంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు.
 
ధనస్సు : కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. నమ్మకం పట్టుదలతో యత్నాలు సాధించండి. సత్‌ఫలితాలు పొందుతారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ప్రైవేటు ఫైనాన్సులో పొదుపు చేయటం మంచిది కాదని గమనించండి.
 
మకరం : దూర ప్రయాణాల్లో వస్తువులు జారవిడుచుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ముఖ్యమైన వ్యవహారాలు కుటుంబీకులకు తెలియజేయటం మీ బాధ్యతగా భావించండి. స్త్రీలు షాపింగ్‌లకోసం ధనం ఖర్చు చేస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం.
 
కుంభం : అవకాశవాదులు అధికం కావడంవల్ల ఊహించని ఒత్తిడికి లోనవుతారు. స్త్రీలకు గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. అర్ధాంతరంగా నిలిచిన పనులు పునఃప్రారంభమవుతాయి. బేకరీ, స్వీట్లు, పూల, పండ్ల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. విదేశాలు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి.
 
మీనం : ఆర్ధిక విషయాలలో ఒడిదుడుకులు తొలిగిపోతాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. దంపతుల మధ్య దాపరికం మంచిదికాదు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే సూచనలున్నాయి. ఆలయాలను సందర్శిస్తారు.