సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం-13.4.2021 ఉదయం 5.45 గంటల నుంచి..?

ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలను తొలగించుకోవాలంటే.. జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన కొన్ని పరిహారాలను పాటిస్తేనే చాలు. అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్న వారు జ్యోతిష్య నిపుణులు సూచించే ఈ సూచనలను పాటిస్తే సరిపోతుంది. తీసుకున్న అప్పును తిరిగి ఇచ్చేయాలంటే.. అప్పుల బాధను తొలగించుకోవాలంటే.. మైత్రేయ ముహూర్తాన్ని గుర్తు పెట్టుకోవాలి. 
 
ఈ ముహూర్తంలో రుణం తీసుకున్న వారికి చేతిలో వున్న డబ్బును కొంచెమైనా చెల్లించినట్లైతే అప్పులు ఇట్టే తీరిపోతాయి. ఈ ముహూర్తంలో అప్పులను తిరిగి ఇచ్చినట్లైతే.. తీసుకున్న అప్పులు త్వరలో తీరిపోయేందుకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని జ్యోతష్య నిపుణులు అంటున్నారు. అశ్వినీ నక్షత్రం, మేష లగ్నం, అనురాధ నక్షత్రం, వృశ్చిక లగ్నం కూడిన సమయాన్ని ''మైత్రేయ ముహూర్తం'' అంటారు. 
 
ఈ ముహూర్తంలో తీసుకున్న అప్పుల్లో కొంచమైనా తిరిగి ఇవ్వడం చేయాలి. ఇలా చేస్తే అప్పులు త్వరలోనే తీరిపోతాయి. ఇంకా మైత్రేయ ముహూర్తం వచ్చే మంగళ, శనివారాల్లో అప్పులిచ్చేయడం మంచిది. 
 
శనివారం, మంగళవారం వచ్చే ప్రదోష సమయంలో తీసుకున్న అప్పులను తిరిగి ఇవ్వడం చేస్తేనూ మంచి ఫలితం వుంటుంది. ఇంకా సూర్య, చంద్ర గ్రహణ సమయం పూర్తైన తర్వాత కూడా అప్పులను తిరిగి ఇచ్చేయవచ్చు. అలాగే మంగళవారం మంగళ హోరలో కూడా రుణాలను తిరిగి ఇవ్వడం ద్వారా అప్పుల బాధలుండవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
ఈ ముహూర్తం 13.4.2021 మంగళవారం ఉదయం 5.45 గంటల నుంచి 7.45 గంటల వరకు వుంటుంది. ఈ ముహూర్తంలో అప్పుల వారికి తీసుకున్న మొత్తంలో కొంతైనా చెల్లించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. రుణబాధల నుంచి విముక్తి చేస్తుందని వారు సెలవిస్తున్నారు.