భార్యాభర్తలు ఒకే రాశి ఉన్న వారైతే... లాభమా..? నష్టమా...?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భార్యాభర్తలిద్దరూ ఒకే రాశి కలిగి వుంటే శ్రేయస్కరం కాదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఒకే రాశికి చెందిన వారు భార్యాభర్తలయితే గ్రహస్థితి సరిగ్గా లేనప్పుడు వారి మధ్య విభేధాలు తలెత్తే అవకాశం ఉంటుంది.

ఒకే రాశికి చెందిన వారు భార్యాభర్తలైతే రాహు, కేతు దశా కాలంలో వారి మధ్య అహం అనే సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒకే రాశి వారు కాబట్టి వారి వ్యక్తిత్వం, భావాలు, మనస్తత్వం సరితూకడంతో కొన్ని సమస్యలు దూరమయ్యే అవకాశం ఉన్నా వారానికి ఒకసారైనా వారి మధ్య విభేధాలు తలెత్తుతాయి.
అంతేకాదు గ్రహస్థితి సక్రమంగా లేని సమయంలో విభేధాలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి జ్యోతిష్య నిపుణుల సలహా ప్రకారం వారు విభేధాలకు దూరంగా ఉండటం మంచిది. ఒకే రాశిలో జన్మించిన వారు అష్టమశని, యేలినాటి శని సమయంలో శనికి తైలాభిషేకం చేయించడం ఉత్తమం. అదేవిధంగా శనివారం రోజు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం శ్రేయస్కరమని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది.