శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 4 డిశెంబరు 2017 (14:13 IST)

మంగళవారం 21 లడ్డూలు హనుమంతునికి సమర్పిస్తే?

మంగళవారం పూట ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. ఆ రోజున నిష్ఠతో శుచిగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానమాచరించాలి. ఇంటిని, పూజాగదిని శుభ్రం చేసుకోవాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించ

మంగళవారం పూట ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. ఆ రోజున నిష్ఠతో శుచిగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానమాచరించాలి. ఇంటిని, పూజాగదిని శుభ్రం చేసుకోవాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. హనుమంతుని పూజకు సిద్ధం కావాలి. స్వామివారికి నైవేద్యంగా వెన్న, తీపి పదార్థాలు, తామరపువ్వులు సిద్ధం చేసుకోవాలి. తమలపాకుల మాల, వడమాలలను కూడా సమర్పించవచ్చు. ముఖ్యంగా హనుమంతునికి లడ్డూలను సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
 
పూజకు తర్వాత బ్రాహ్మణులకు ఆ లడ్డూలను దానం చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. మంగళవారం ఒంటి పూట భోజనం చేసి.. కారం, ఉప్పు అధికంగా లేని పదార్థాలను తీసుకోవాలి. 21 వారాల పాటు మంగళవారం హనుమంతుడిని పూజించే వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి. మంగళవారం హనుమంతుడి వ్రతంతో ఆరోగ్యం, ఐశ్వర్యం, ప్రశాంతత, సంతానం, ఉన్నత ఉద్యోగ అవకాశాలు, లక్ష్యాలను చేరుకోవడం వంటి శుభఫలితాలుంటాయని పండితులు చెప్తున్నారు.