శనివారం, 4 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 10 డిశెంబరు 2018 (19:57 IST)

మంగళ లేదా శనివారం హనుమంతుడిని పూజిస్తే... (Video)

అబ్బా.. అన్నీ సమస్యలే.. ఏంటి.. పరిస్థితి ఇలా దారుణంగా వుందని బాధపడుతున్నారా.. అయితే వెంటనే మంగళవారం పూట హనుమంతుడి ఆలయానికి వెళ్లి రండి.. సమస్యలన్నీ సానుకూలమవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. హనుమంతునికి మినపప్పు, మిరియాలతో చేసిన వడలను సమర్పించుకుంటే సరిపోతుంది. ఆ వడలను అక్కడే ఆలయాల్లో వున్నవారికి ప్రసాదంగా అందిస్తే.. ఈతిబాధలు తొలగిపోతాయి. 
 
హనుమంతుడిని పూజిస్తే.. శ్రీరామ అని పలికితే.. భక్తులను పలకరిస్తాడు. రోజూ హనుమాన్ చాలీసా వినడం ద్వారా సుఖశాంతులు పొందవచ్చు. అలాగే మంగళ లేదా శనివారాల్లో ఆలయాల్లో ఆయన్ని దర్శించుకునే వారికి సకలసంపదులు చేకూరుతాయి. మంగళవారాల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి.. ఉపవాసముండి.. హనుమంతుడిని ఆలయాన్ని దర్శించుకునే వారికి ఆర్థిక ఇబ్బందులు వుండవు. మానసిక ప్రశాంతత నెలకొంటుంది. 
 
మంగళవారం హనుమంతుని ఆలయాలకు వెళ్లి పండ్లు, పుష్పాలు సమర్పించి నేతి దీపం వెలిగించే వారికి కోరిన కోర్కెలు నెరవేరుతాయి. తమలపాకులపై శ్రీరామజయం అని రాసి.. వాటిని మాలగా కట్టి హనుమంతునికి సమర్పించడం ద్వారా నవగ్రహదోషాలు తొలగిపోతాయి. ఆపై ఏడుసార్లు హనుమంతుడిని ప్రదక్షణలు చేసి.. ఆపై ఆలయంలో కూర్చుని.. హనుమాన్ చాలీసా చదవాలి. 
 
ఇంకా నూనెను, కుంకుమను హనుమంతుని ఆలయానికి కానుకగా ఇస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అందుకే వెన్నతో లేదా కుంకుమతో హనుమంతునికి అర్చన చేయించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.