మంగళవారం, 13 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2023 (13:08 IST)

మహాశివరాత్రి రోజున ఉపవాసం, పూజ చేస్తే...?

Lord shiva
ప్రతి సంవత్సరం శివరాత్రి నెలకు ఒకసారి వచ్చినప్పటికీ, మహాశివరాత్రి సంవత్సరానికి ఒకసారి వచ్చే ముఖ్యమైన రోజు. మహాశివరాత్రి పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజులలో ఒకటి కాబట్టి పరమశివుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందేందుకు మహాశివరాత్రి అత్యంత ముఖ్యమైనది. 
 
ఈ రోజు ఉపవాసం ఉండి శివుడిని ప్రార్థిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. సకల పాపాలు తొలగి పుణ్యం పెరుగుతుంది. మహాశివరాత్రి నాడు శివునికి ఉపవాసం చేయడంలో జాగ్రత్తగా వుండటం ముఖ్యం. 
 
మహా శివరాత్రి సమయంలో ఏమి చేయకూడదు?
మహా శివరాత్రి వ్రతం సమయంలో, కొంతమంది తెలిసి లేదా తెలియక కొన్ని తప్పులు చేస్తారు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, రాత్రంతా మేల్కొని ఉంటే సరిపోతుంది. 
 
శివరాత్రి అంటే రాత్రంతా మేల్కొని శివుడిని మనస్పూర్తిగా పూజించడం. కానీ కొందరు మాత్రం రాత్రంతా మేల్కొని ఉండేందుకు వీడియో గేమ్‌లు ఆడటం, సినిమాలు చూడటం, సెల్‌ఫోన్‌లు చెక్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. అలా చేయడం ఉపవాసంగా పరిగణించబడదు.
 
రాత్రంతా మేల్కొని ఉండేందుకు శ్లోకాలు పఠించవచ్చు. లేదంటే నమశ్శివాయ మంత్రాన్ని పఠించవచ్చు. అదేవిధంగా శివరాత్రి ముగిసి తెల్లవారుజామున చాలామంది నిద్రపోతారు. 
 
అయితే మరుసటి రోజు నిద్రపోకుండా.. వేరేదైనా పనిపై దృష్టి పెట్టవచ్చు. ఇలా శివుని అనుగ్రహం పొంది జీవితంలో విజయం సాధించాలంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పవిత్రమైన మహా శివరాత్రిని ఉపవాసంతో ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయి.