శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 29 జులై 2019 (19:06 IST)

కుంకుమ జారి కింద పడితే అశుభమా? (video)

సాధారణంగా మనకు పెద్దలు చెప్పిన కొన్ని విషయాలు మనసులో బలంగా నాటుకుపోతాయి. వారు చెప్పారు కాబట్టి కొన్ని విషయాలను అపశకునంగా భావిస్తాము. అలాంటి వాటిల్లోనే... ఆడవాళ్లు కుంకుమ జారి కింద పడటం అశుభంగా భావిస్తారు. ఇది అపోహ మాత్రమేనట.
 
అనుకోకుండా కుంకుమ కింద పడ్డప్పుడు అలా పడిపోయిన చోట భూదేవికి బొట్టు పెట్టి మిగతా కుంకుమను చెట్లలో వేయాలి. నిజానికి కుంకుమ గాని కుంకుమ భరిణ గానీ కింద పడడం శుభ సూచకమే. భూమాత తనకి బొట్టు పెట్టమని చేసే సంకేతం అది.
 
ఏదైనా పూజ కానీ, వ్రతం కానీ చేసేటప్పుడు కుంకుమ కింద పడడం అత్యంత శుభకరం. అది అమ్మవారి అనుగ్రహం. తానుగా అమ్మ మన చేత బొట్టు పెట్టించుకున్నట్లుగా భావించాలి. అటువంటి అదృష్టాన్ని అశుభంగా భావించడం, బాధ పడడం సరి కాదు.