1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (12:09 IST)

''షిరిడి'' మహా పవిత్రం.. ఈ ప్రాంతంలో...

షిరిడీ సాయిబాబాను పూజించే భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆపదల నుండి, అనారోగ్యాల నుండి, ఆర్థికపరమైన సమస్యల నుండి కాపాడుతూ ఉంటాడని భక్తులు విశ్వసిస్తుంటారు. బాబా చూపిన లీలావిశేషాలను కథలుగా చాలామంది చెప్ప

షిరిడీ సాయిబాబాను పూజించే భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆపదల నుండి, అనారోగ్యాల నుండి, ఆర్థికపరమైన సమస్యల నుండి కాపాడుతూ ఉంటాడని భక్తులు విశ్వసిస్తుంటారు. బాబా చూపిన లీలావిశేషాలను కథలుగా చాలామంది చెప్పుకుంటుంటారు. ఓసారి బాబా భక్తుడైన శ్యామా పాము కాటుకు గురవుతాడు. పాముకాటుకు మంత్రం, మందిచ్చే వాళ్లు ఎంతమంది ఉన్నా అతను మాత్రం బాబా దగ్గరికే వస్తాడు.
  
 
బాబా అతనిని చూడగానే కిందికి దిగిపొమ్మని, పైకి వస్తే ఏం చేస్తానో చూడమని బాగా కోపంగా అంటారు. బాబా ధోరణి శ్యామాకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు బాబా ఆ మాట అన్నది అతనిని కాదు. శ్యామా శరీరంలో ఎక్కుతోన్న విషాన్ని అనే విషయం అక్కడి వాళ్లకు అర్థమవుతుంది. బాబా మాట అతని కంటి చూపే విషానికి విరుగుడుగా పనిచేశాయని గ్రహిస్తారు. అతనికి ప్రాణ భిక్ష పెట్టిన బాబా పాదాలపై పడి శ్యామా కృతజ్ఞతలు తెలియజేస్తాడు.