శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 26 జూన్ 2019 (20:47 IST)

అలాంటివారికి నేనెప్పుడూ రుణపడి వుంటాను... షిర్డీ సాయి

ఎవరైనా తన సర్వస్వాన్ని నా సన్నిధానంలో సమర్పిస్తే , నిరంతరం నన్ను స్మరిస్తుంటే, తన అహంకారాన్ని, అవిద్యను, అజ్ఞానాన్ని నశింపచేసుకుంటారు. అతడు ప్రాపంచికమైన అన్ని దుర్గుణాలకు దూరమై, పాపకృత్యములనుండి విముక్తి పొందుతాడు. అతడికి నిరంతర ఆనందం లభిస్తుంది.
 
2. ఎవరైతే నన్నే ఆశ్రయిస్తూ,తన మనస్సును సమస్త ప్రాపంచిక విషయముల నుండి ప్రాపంచిక సుఖముల నుండి మరల్చి నన్నే స్మరిస్తూ ఉంటారో వారు పరమానందాన్ని పొందుతారు. 
 
3. ఎవరైనా వారి భారాన్ని పరిపూర్ణ విశ్వాసంతో నాపై ఉంచితే దానిని నేనే  భరిస్తూ వారిని కాపాడతాను. 
 
4. నేను సర్వాంతర్యామిని. భక్తుడు పతనావస్ధలో ఉంటే, అతనిని కాపాడుటే నా విధి. ప్రతి ప్రాణిలో నన్ను దర్శిస్తూ, కరుణార్ద్ర హృదయంతో ఆదరించి పోషిస్తారో, వారు నన్నునిజంగా పోషించిన వారౌతారు.
 
5. నన్ను స్మరిస్తున్నవారికి, నా శరణాగతి కోరిన వారికి నేనెప్పుడు ఋణపడి ఉంటాను. నేను ఆత్మ సందర్శనాన్ని, కైవల్యాన్ని ప్రసాదించి నా ఋణము తీర్చుకుంటాను. అత్యంత ప్రేమతో నన్ను స్మరించిన వారికి వారి సమస్త కోరికలను తీరుస్తాను.
 
6. నా కధలు అత్యంత శ్రద్దతో విని మననం చేయువారికి సమస్త రోగాల నుండి విముక్తి కలుగుతుంది. నిత్యం స్మరిస్తూ, నన్నే ధ్యానిస్తూ నా నామోచ్చారణ చేస్తుండేవారిని, నన్ను స్మరిస్తున్న వారికి, నా శరణాగతి కోరిన వారికి నేనెప్పుడు ఋణపడి ఉంటాను.