సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By వి
Last Modified: బుధవారం, 8 జులై 2020 (18:58 IST)

కర్నూలు జిల్లా పుణ్యక్షేత్రాలపై కరోనావైరస్ పడగ

కర్నూలు జిల్లా ఆధ్యాత్మిక వనంగా వర్థిల్లుతోంది. పండుగలు వచ్చినా సెలవులు దొరికినా తెలుగు రాష్ట్రాల ప్రజలు కర్నూలు బాట పట్టాల్సిందే. ఓవైపు ప్రకృతి రమణీయత, మరోవైపు ఆధ్యాత్మికతకు నెలవు. కర్నూలు జిల్లా నిత్యం సందడితో ఆకర్షించే పర్యాటక కేంద్రం.
 
ఇప్పుడు కరోనావైరస్ ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలపై పడగ విప్పింది. దీంతో కోవెలలు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. ఇక్కడ స్వయంభుగా వెలసిన దేవదేవుడు, సహజసిద్దంగా ఏర్పడిన ప్రకృతి అందాలు, ద్వాదశ జోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం, భ్రమరాంబికా శక్తిపీఠం, శ్రీశైలం మల్లన్న పుణ్యక్షేత్రం తదితర దర్శనీయ ప్రదేశాలు భక్తులు లేక వెలవెలబోతున్నాయి.