ఆగస్టు 23న తిరుచానూరు శ్రీకృష్ణస్వామివారి ఆలయంలో గోకులాష్టమి

lord shiva
ఎం| Last Updated: సోమవారం, 12 ఆగస్టు 2019 (18:21 IST)
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామి వారి ఆలయంలో ఆగస్టు 23వ తేదీన గోకులాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొదటిరోజు గోకులాష్టమి ఆస్థానం, రెండో రోజు ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. గోకులాష్టమి రోజైన శుక్రవారం ఉదయం శ్రీకృష్ణస్వామి మూలవర్లకు అభిషేకం,అర్చనలు మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

అనంతరం సాయంత్రం 6.45 నుండి రాత్రి 8.00 గంట వరకు స్వామివారు పెద్దశేష వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. అదేవిధంగా
ఆగస్టు 24న శనివారం సాయంత్రం 6.00 నుండి 7.30 గంటల వరకు ఉట్లోత్సవం, ఆస్థానం వైభవంగా జరుగనుంది.దీనిపై మరింత చదవండి :