శనివారం, 4 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 6 మార్చి 2021 (20:18 IST)

కమనీయం.. కళ్యాణ వేంకటేశ్వరుడి గరుడసేవ

చిత్తూరు జిల్లాలో వెలసిన కళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం గరుడవాహనసేవ కన్నులపండువగా జరిగింది. కోవిడ్ కారణంగా ఏకాంతంగా గరుడవాహనసేవను టిటిడి నిర్వహించింది.
 
వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య గరుడవాహనసేవ కొనసాగింది. ప్రతియేటా స్వామివారి బ్రహ్మోత్సవాలను ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. సాధారణంగా వాహనసేవలను మాఢావీధుల్లో నిర్వహిస్తుంటారు.
 
వేలాదిమంది భక్తులు వాహన సేవను తిలకించే అవకాశం ఉంటుంది. అలాంటిది కోవిడ్ విజృంభిస్తుండడంతో వెనక్కితగ్గిన టిటిడి ఏకాంతంగా వాహనసేవలను నిర్వహిస్తోంది. మరో నాలుగురోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. వాహనసేవలన్నీ ఆలయంలో ఏకాంతంగా జరుగుతుండడం భక్తులను నిరాశకు గురిచేస్తోంది.